గుంటూరు, కృష్ణా జిల్లాల వైకాపా ప్రజాప్రతినిధులు అమరావతికి మద్దతుగా నిలబడి పదవులకు రాజీనామా చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రజల కన్నా పదవులే ముఖ్యం అనుకుంటే వారి రాజకీయ భవిష్యత్‌కు సమాధి తప్పదన్నారు. గతంలో జగన్‌ని నమ్మి ఎంతమంది రాజకీయనాయకులు, అధికారులు జైలుపాలయ్యారో గుర్తుతెచ్చుకోవాలని హెచ్చరించారు. ఇప్పుడు మళ్లీ సీఎం జగన్‌ని నమ్మి రాజకీయ సన్యాసులు ఎందుకు అవుతారని నిలదీశారు. తమ ఆశల్ని, ఆకాంక్షాలని నెరవేరుస్తారని నమ్మి ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం రైతులు వైపు నిలబడతారో.. లేక పదవుల కోసం ప్రజలకు ద్రోహం చేసినవారిగా చరిత్రలో నిలుస్తారో.. తేల్చుకోవాలని స్పష్టంచేశారు. నమ్మక ద్రోహులను, నయవంచకులును రాష్ట్ర ప్రజలు క్షమించరన్న విషయం వారు గుర్తుంచుకోవాలని అనగాని ఆక్షేపించారు.
నమ్మక ద్రోహులను, నయవంచకులను ప్రజలు నమ్మరు: అనగాని - ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తాజా వార్తలు
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి 3 ప్రాంతాల్లోని సహజవనరులను దోచుకునేందుకు కుట్ర పన్నారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు. అమరావతిని ముక్కలు చేయడం అంటే భార్య, భర్త, పిల్లలను వేరు చేయడమేనని మండిపడ్డారు.
tdp mla anagani