అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల్లో వరుసగా ఐదో రోజూ సభ నుంచి తెదేపా ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. పీటీఐ కథనం ప్రకారం... సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారన్న కారణంతో... ఆఖరిరోజు సభ నుంచి 10 మంది తెదేపా ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్కు నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు, మిగిలిన ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అంతకుముందు సభలో తెదేపా ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఈ తీర్మానంపై చర్చించాలని కోరింది.
తెదేపా వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. తెదేపా శాసనసభ్యులు తీర్మానంపై చర్చించాలని పట్టుబడ్డారు. ఏడాదిగా లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందలేదని అన్నారు. సభ వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. తీర్మానంపై చర్చించాలని నిరసన చేశారు.