ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పింఛన్ల పోరు.. నిరసనల హోరు - పింఛన్లు తొలగింపును నిరసిస్తూ నెల్లూరులో ధర్నా

రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తొలగింపును నిరసిస్తూ.. తెదేపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టి వినతి పత్రాలు అందించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. తొలగించిన పింఛన్లను పునరుద్దరిచాలని పలువురు కార్యకర్తలు, బాధితులు కోరారు.

tdp  members  protest for elimination of pensions across the state
పింఛన్ల పోరు.. నిరసనల హోరు

By

Published : Feb 11, 2020, 12:28 PM IST

చిత్తూరు జల్లాలో..

పేద ప్రజల రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన చిత్తూరు జిల్లాలో ధర్నా చేపట్టారు. కుప్పంలో శాసనమండలి సభ్యులు శ్రీనివాసులు, నాలుగు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిత్తూరులోని తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని ఆదేశానుసారం.. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఎండీఓ కార్యాలయం వద్ద నిరసలు చేశారు. అర్హులందరికీ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలోని తేదేపా, భాజపా నేతలు వేర్వేరుగా నిరసన కార్యక్రమం చేపట్టారు.

చిత్తూరులో పింఛన్ల పోరు.. నిరసనల హోరు

అనంతపురంలో..

పింఛన్లు తొలగింపును నిరసిస్తూ అనంతపురం జిల్లా తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెనుగొండ నియోజకవర్గంలోని లబ్ధిదాలకు పింఛన్లు ఇవ్వాలంటూ సబ్​కలెక్టర్​కు వినతి పత్రం అందించారు. తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ధర్నా చేశారు. మడకశిర పట్టణ మున్సిపల్ కార్యాలయం, చెన్నేకొత్తపల్లి ఎమ్మార్వో కార్యాలయం వద్ద తెదేపా నేతలు పింఛన్ల కోసం ధర్నా చేపట్టారు.

అనంతపురంలో పింఛన్ల పోరు.. నిరసనల హోరు

గుంటూరులో...

తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్దరించాలంటూ తెలుగుదేశంపార్టీ నాయకులు గుంటూరు జిల్లాలో ధర్నా చేపట్టారు. మంగళగిరి, తాడేపల్లిలో ఆందోళనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మరోసారి మాట తప్పారని లబ్దిదారులు నినాదాలు చేశారు. రద్దుల సీఎం వద్దంటూ తమ నిరసనను తెలియజేశారు. గుంటూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్​కి వినతి పత్రం అందచేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఫించన్లు ఇవ్వాల్సిందిగా కోరారు.

గుంటూరులో పింఛన్ల పోరు.. నిరసనల హోరు

విశాఖపట్టణంలో..

పేదోళ్ల పింఛన్లు తొలగింపుపై తెలుగుదేశం పార్టీ పోరుబాట పట్టింది. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. మాడుగులలో తెదేపా నియోజకవర్గ ఇన్​చార్జి, మాజీ శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో పింఛన్ తొలగించిన బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వం కక్షపూరితంగా పింఛన్లు తొలగించిందని మండిపడ్డారు. అర్హత ఉన్నా.. తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. భీమునిపట్నంలోనూ పింఛన్లను పునరుద్ధరించాలంటూ ఆందోళన చేపట్టారు. పాయకపావుపేటలోనూ ఆందోళనలు చేశారు.

విశాఖలో పింఛన్ల పోరు.. నిరసనల హోరు

కర్నూలులో..

అర్హులైన వృద్దులు, వికలాంగులు, వితంతువుల పింఛన్ల తొలగింపునకు నిరసనగా కర్నూలు జిల్లాలో తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నగరంలోని ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. పేదలకు అండగా ఉన్న ఫించన్లు, రేషన్ కార్డులను తొలగించడం సరికాదని అన్నారు. నంద్యాలలోని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, కార్యకర్తలు, బాధితులతో కలిసి.. ఆర్డీవోకి కార్యలయం ఎదుట ఆందోళన చేశారు. ప్రభుత్వం తీరు అందరినీ ఇబ్బందులకు గురిచేస్తుందని బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆర్డీవో రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

కర్నూలులో పింఛన్ల పోరు.. నిరసనల హోరు

నెల్లూరు, కృష్ణా, శ్రీకాకుళంలో..

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యాన తేదేపా నాయకులు నిరసన చేపట్టారు. పేదోళ్ల పెన్షన్లు తొలగించడం రేషన్ కార్డులను ఎత్తివేయడం సరికాదని నినాదాలు చేశారు ప్రభుత్వ కార్యలయాలకు ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా తిరిగి వినతి పత్రం అందించారు. కృష్ణా జిల్లా విజయవాడలోనూ నిరసనలు హోరెత్తాయి. కొత్త పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వానికి ఉన్న పెన్షన్లు రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని తెదేపా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని పలు మండలాల్లో ధర్నా చేశారు. ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట పింఛన్లను పునరుద్దరించాలంటూ ఆందోళన చేపట్టారు.

నెల్లూరు, కృష్ణా, శ్రీకాకుళంలో పింఛన్ల పోరు.. నిరసనల హోరు

ఇదీ చదవండి:పింఛన్ల తొలగింపుతో వృద్ధుల అవస్థలు: తంగిరాల సౌమ్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details