ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

chandrababu:పేదలకు ఇళ్ల స్థలాలపై పిటిషన్‌ వేసింది వైకాపా నేతలే - tdp latest updates

పేదలకు ఇళ్ల స్థలాలపై వైకాపా నేతలతోనే కోర్టులో పిటిషన్‌ వేయించి తమపై బురద జల్లుతున్నారని తెదేపా మండిపడింది. ‘పేదల గృహాలకు పునాదుల దశలో ఇచ్చే మొత్తానికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన రూ.3,700 కోట్లలో రూ.2 వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించింది. సెంటు పట్టాల పంపిణీలోనూ వైకాపా నేతలు రూ.6,500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు’ అని ధ్వజమెత్తింది. పార్టీ ముఖ్య నేతల సమావేశం సోమవారం తెదేపా అధినేత చంద్రబాబు(chandrabau news) అధ్యక్షతన ఆన్‌లైన్‌లో జరిగింది.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

By

Published : Oct 12, 2021, 7:42 AM IST

పేదలకు ఇళ్ల స్థలాలపై వైకాపా నేతలతోనే కోర్టులో పిటిషన్‌ వేయించి తమపై బురద జల్లుతున్నారని తెదేపా మండిపడింది. ‘పేదల గృహాలకు పునాదుల దశలో ఇచ్చే మొత్తానికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన రూ.3,700 కోట్లలో రూ.2 వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించింది. సెంటు పట్టాల పంపిణీలోనూ వైకాపా నేతలు రూ.6,500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు’ అని ధ్వజమెత్తింది. పార్టీ ముఖ్య నేతల సమావేశం సోమవారం తెదేపా అధినేత చంద్రబాబు(chandrabau news) అధ్యక్షతన ఆన్‌లైన్‌లో జరిగింది. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర నిధుల నుంచి మరో రూ.2 లక్షల చొప్పున విడుదల చేయాలని, దారి మళ్లించిన నిధుల్నీ వెంటనే జమ చేయాలని తెదేపా డిమాండ్‌ చేసింది. సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలివీ.

కమీషన్ల కోసమే విద్యుత్‌ కృత్రిమ కొరత

*రాష్ట్రంలోని విద్యుత్‌ ప్లాంట్లలో సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయిస్తే బహిరంగ మార్కెట్‌లో రూ.15 నుంచి రూ.20 పెట్టి కొనాల్సిన అవసరం రాదు. కమీషన్ల కోసం కృత్రిమంగా కొరత సృష్టించి బహిరంగ మార్కెట్‌లో కొంటున్నారు. తెలంగాణకు లేని సమస్య ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు వచ్చింది? రోజుకి 2,3 గంటల అప్రకటిత కోతలు విధిస్తున్నారు. బిల్లులు కట్టలేదని ప్రభుత్వ పాఠశాలలకు కనెక్షన్‌ కట్ చేస్తున్నారు.

*ఆసరా పేరుతో జగన్‌రెడ్డి మహిళలకు టోకరా పెట్టారు. తెదేపా హయాంలో 98 లక్షల మంది మహిళలకు, అందరికీ సమానంగా లబ్ధి చేకూర్చగా, జగన్‌ ఆ సంఖ్యను 78 లక్షలకు కుదించారు. డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు జమ చేస్తే, జగన్‌రెడ్డి ఇప్పటి వరకు రూ.10 వేల కోట్లు కూడా వేయలేదు.

*ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులపై న్యాయస్థానం తీర్పుతోనైనా జగన్‌రెడ్డి తీరు మారాలి.

*కేంద్రం ఇచ్చే మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ వినియోగంలో జగన్‌రెడ్డి విఫలమయ్యారు. రూ.6 లక్షల కోట్ల అప్పు చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.

*ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌రెడ్డి తీరని ద్రోహం చేశారు. పీఆర్‌సీ అమలు చేయలేదు. డీఏలు చెల్లించడం లేదు. జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు. పింఛన్ల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి. ఉద్యోగుల సమస్యల్ని తక్షణం పరిష్కరించాలి.
మంగళవారం నుంచి చంద్రబాబు తలపెట్టిన కుప్పం పర్యటన భారీ వర్షాల వల్ల వాయిదా పడింది.

హైకోర్టుకు వెళ్లిన శివ మురళి.. వైకాపా కార్యకర్తే: మాజీ మంత్రులు జవహర్‌, సుజాత

గన్‌, సజ్జల వ్యూహాత్మకంగా పేదలకు ఇళ్ల నిర్మాణంపై వైకాపా కార్యకర్త పొదలి శివమురళితో హైకోర్టులో పిటిషన్‌ వేయించారని మాజీ మంత్రులు కేఎస్‌ జవహర్‌, పీతల సుజాత ఆరోపించారు. శివమురళిని సీఎం జగన్‌ అప్యాయంగా ఆలింగనం చేసుకున్న చిత్రాలున్నాయని, వీటిపై సజ్జల ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ‘ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు అవసరం. ఈ గండం నుంచి బయటపడేందుకు వైకాపా పెద్దలే న్యాయస్థానంలో పిటిషన్‌ వేయించారు. వాస్తవం బయటకురాగానే తెదేపానే అడ్డుకుందంటూ గోబెల్స్‌ ప్రచారానికి తెరలేపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శివమురళితో మాట్లాడి పిటిషన్‌ వెనక్కు తీసుకునేలా చూడాలని’ వారు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:HC: ఆ సెక్షన్ ప్రకారం నిందితులకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాల్సిందే: హైకోర్డు

ABOUT THE AUTHOR

...view details