శాసనసభ సమావేశాల్లో వైకాపా డొల్లతనం బయటపడిందని, జవాబు ఇవ్వలేక నేతలతో తిట్టిస్తున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన.. తాజా పరిణామాలపై స్పందించారు. సభ్యుడికి మైక్ ఇవ్వొద్దని సభాపతిని సీఎం కోరడం విడ్డూరంగా ఉందన్నారు. దిశ చట్టం చేసినా... మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదని విమర్శించారు. ప్రశ్నించే ప్రతిపక్షాలు, మీడియా గొంతునొక్కడమే లక్ష్యంగా వైకాపా పని చేస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు.
వైకాపా డొల్లతనం బయటపడింది: చంద్రబాబు - అమరావతిలో తెదేపా పార్టీ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
అమరావతిలోని తెదేపా కార్యాలయంలో పార్టీ నేతలతో జాతీయ అధ్యక్షుడు సమావేశమయ్యారు. మద్య నియంత్రణపై చర్చలో తమపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు.

వైకాపా డొల్లతనం బయటపడింది.. తెదేపా అధినేత