పంచాయతీ ఎన్నికల్లో సంఖ్యా విజయం వైకాపాదే ఐనా.. అసలు సిసలు గెలుపు తెదేపాదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను.. రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. మనదేశానికి అర్థరాత్రి స్వాతంత్య్రం వస్తే.. పంచాయతీ ఎన్నికల్లో జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలకు అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చిందని దుయ్యబట్టారు. తెదేపా మద్దతుతో పోటీ చేసే అభ్యర్థుల్లో కొంతమందిని చంపేశారని, మరికొంత మందిని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా మద్దతుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్ పేరుతో వైకాపా గెలుపు ప్రకటించుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
' పంచాయతీ ఎన్నికల్లో అసలు గెలుపు తెదేపాదే' - పంచాయతీ ఎన్నికలపై నారా లోకేశ్ వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో అసలు గెలుపు తెదేపాదే అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. తెదేపా మద్దతుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్ పేరుతో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల తెదేపా అభ్యర్థులను బెదిరించి గెలుపొందారని దుయ్యబట్టారు.
tdp leadet nara lokesh fires on ysrcp on panchayath elections