ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి: యనమల - yanamala news

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ ఉపేక్షించరాదని...తక్షణమే జోక్యం చేసుకోవాలని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కరోనా దృష్ట్యా ఎన్నికలకు సహకరించలేమని ఉద్యోగ సంఘాలు చెప్పటం దారుణమని తెదేపా నేత బండారు సత్యనారాయణ అన్నారు.

Tdp leaders yanamala and bandaru comments on local bodies
యనమల, బండారు

By

Published : Jan 10, 2021, 12:22 PM IST

ఎన్నికలకు సహకరించేది లేదని మంత్రులు, ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. స్థానిక ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేకనే ఆటంకాలు కల్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీలో పరిణామాలపై గవర్నర్ ఉపేక్షించరాదని... తక్షణమే జోక్యం చేసుకోవాలని యనమల డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణ అధికారం ఈసీదేనన్న ఆయన.. పంచాయతీ ఎన్నికలకు ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్​దే అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె(3) ఇదే చెబుతోందని స్పష్టం చేశారు.

ఇళ్ల పట్టాల పంపిణీలో ఉద్యోగుల ఆరోగ్య భద్రత పట్టలేదా?: బండారు

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల తీరుపై మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణ ఆవేదన చెందారు. రాజ్యాంగ ప్రక్రియైన ఎన్నికలను అపాలని ఉద్యోగ సంఘాలు ఎందుకు అనుకున్నాయని ప్రశ్నించారు. కరోనా దృష్ట్యా ఎన్నికలకు సహకరించలేమని చెప్తున్న ఉద్యోగ సంఘాలు ..ఈ నాలుగు నెలలు పాటు ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారని...అప్పుడు ఆరోగ్య భద్రత పట్టలేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల ప్రక్రియకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు.

ఇదీ చదవండి:

ప్రమాదమని తెలిసినా... ప్రాణాలకు తెగించి మరీ..!

ABOUT THE AUTHOR

...view details