తెలుగుదేశం అధినేత చంద్రబాబు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆ పార్టీ నేతలు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేయనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడి విషయాన్ని వివరించనున్నారు. పోలీసులే నిరసనకారులకు అనుమతినివ్వడం, జిల్లా పర్యటనలలోనూ పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహించడం వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని తెదేపా నేతలు అంటున్నారు. దాడి విషయమై ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు కేంద్ర హోంసెక్రటరీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖలు రాశారు.
నేడు గవర్నర్‌ను కలవనున్న తెదేపా నేతలు - చంద్రబాబు కాన్వాయ్ దాడి న్యూస్
అమరావతి పర్యటనలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడి విషయాన్ని గవర్నర్ దృష్టికి తెదేపా తీసుకెళ్లనుంది. నేడు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కలిసి చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు పర్యటనలో నిరసనలకు అనుమతి...పోలీసుల నిర్లక్ష్య ధోరణిపైనా గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.
రేపు గవర్నర్‌ను కలవనున్న తెదేపా నేతలు
Last Updated : Dec 3, 2019, 2:18 AM IST