ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవోల ఆఫ్‌లైన్ వ్యవహారం.. సాయంత్రం గవర్నర్​ను కలవనున్న తెదేపా నేతలు - గవర్నర్​ను కలువనున్న తెదేపా నేతలు

నేటి సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​ను తెదేపా నేతలు కలవనున్నారు. ప్రభుత్వ జీవోల ఆఫ్‌ లైన్‌ వ్యవహారంపై తెదేపా నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

TDP leaders will meet Governor
గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న తెదేపా నేతలు

By

Published : Aug 20, 2021, 11:47 AM IST

ప్రభుత్వ జీవోల ఆఫ్​లైన్‌ వ్యవహారంపై తెదేపా నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు సాయంత్రం 5.15 నిమిషాలకు గవర్నర్‌ బిశ్వభూషణ్​ హరిచందన్​ను తెదేపా నేతలు వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, బోండా ఉమ తదితర నేతలు కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు.

జీవోలు ఆన్​లైన్​లో ఉంచరాదని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న బ్లాంక్, రహస్య జీవోలపై గతంలో గవర్నర్​కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి

AMARAVATI CAPITAL: రాజధాని అంశాలపై హైకోర్టులో సోమవారం విచారణ

ABOUT THE AUTHOR

...view details