రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి సంబంధించి తెలుగుదేశం నేతలు నేడు గవర్నర్ బిశ్వభూషణ్‌ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. 130కి పైగా దాడి ఘటనలు జరిగాయని ఆరోపిస్తున్న తెదేపా... వీటన్నింటిపైనా సీబీఐ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలతో కూడిన బృందం గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో భేటీ కానుంది.
నేడు గవర్నర్‌తో తెదేపా బృందం భేటీ - గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వార్తలు
తెలుగుదేశం నేతల బృందం నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవనుంది. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై చర్చించే అవకాశముంది.
![నేడు గవర్నర్‌తో తెదేపా బృందం భేటీ ap governor biswabhusan harichandan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10146581-98-10146581-1609971119028.jpg)
ap governor biswabhusan harichandan