తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబును ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నాయకులు పరామర్శించారు. అశోక్ బాబుపై తప్పుడు కేసులు పెట్టారని కేశినాని నాని విమర్శించారు. అలాంటి వాటికి భయపడేదే లేదన్న ఎంపీ.. ఎంత బెదిరించినా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పోరాటానికి ఎంత దూరమైనా వెళ్తామని చెప్పారు. సంక్షేమ పథకాలను తాము వ్యతిరేకం కాదని.. అర్హులందరికీ అవి అందాలన్నారు.
జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారు: గద్దె రామ్మోహన్