తమ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ఇందుకు విజయవాడలోనే పథక రచన చేసినట్లు తెలుస్తోందని... రౌడీషీటర్లు, కిరాయి మూకలతో ఈ పని చేయించారని విమర్శించారు. పట్టాభిని తన నివాసంలో కలిసి పరామర్శించారు.
'పట్టాభిపై దాడి వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంది' - unknown persons attack Pattabhi
దుండగుల చేతిలో దాడికి గురయిన తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిని...ఆయన నివాసంలో పలువురు తెదేపానేతలు కలిసి...పరామర్శించారు. దాడికి విజయవాడలోనే పథక రచన చేశారని...దీని వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని తెదేపానేతలు ఆరోపించారు.
!['పట్టాభిపై దాడి వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంది' Tdp Leaders visit pattabhi house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10476736-28-10476736-1612279365190.jpg)
పట్టాభికి తెదేపానేతలు పరామర్శ
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. వైకాపా నేతలు హింస ద్వారా ప్రజలను భయపెట్టి.. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పది రోజుల కిందట విజయవాడలో ఒక ఎమ్మెల్యే ఇంట్లో సమావేశమై పట్టాభిపై దాడికి పథక రచన చేసినట్లు తమకు సమాచారం ఉందని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి:తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు.. కారు ధ్వంసం