ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chandrababu Delhi tour: నేడు దిల్లీకి తెదేపా బృందం..మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీ - tdp latest news

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి తెదేపా నేతల బృందం.. నేడు ఫిర్యాదు చేయనున్నారు. దీని కోసం చంద్రబాబు(Chandrababu)తో పాటు మొత్తం 18 మంది దిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్​మెంట్ ఖరారు కాగా... ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

Chandrababu
Chandrababu

By

Published : Oct 24, 2021, 7:56 PM IST

Updated : Oct 25, 2021, 2:29 AM IST

రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించి.. రాష్ట్రపతి పాలన విధించాలనే అజెండాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలో పార్టీ బృందం రెండు రోజులు దిల్లీలో పర్యటించనుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించటంతో పాటు... ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పేట్రేగుతోందని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​(President Ram Nath covind)తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ(pm modi), హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. కొవిడ్‌ దృష్ట్యా చంద్రబాబు సహా ఐదుగురికే అనుమతి లభించింది. ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుతో పాటు మొత్తం 18 మంది దిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పేట్రేగుతోందని, మాదకద్రవ్యాలకు, గంజాయి సాగుకు ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రంగా మార్చిందని, ప్రభుత్వంలోని పెద్దలే వీటిని ప్రోత్సహిస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి తెదేపా ఫిర్యాదు చేయనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీలు, కొందరు పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యనేతలు.. ఉదయం 6గంటలకు చంద్రబాబుతో కలిసి హైదరాబాద్‌ నుంచి నుండి దిల్లీ వెళ్లనున్నారు.

ఇదీ చదవండి

Chandrababu Delhi tour: రాష్ట్రంలో పరిణామాలు, అరాచకాల అజెండాగా తెదేపా దిల్లీ పర్యటన

Last Updated : Oct 25, 2021, 2:29 AM IST

ABOUT THE AUTHOR

...view details