Nimmala RamaNaidu on Chandrababu Security: జగన్ పాలనలో చంద్రబాబు ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు తెలిపారు. సొంత బాబాయ్‌ను చంపినవాడి కన్ను నేడు చంద్రబాబుపై పడిందని ప్రజలు ఆందోళన పడుతున్నారన్నారు. ఉన్మాద పాలన నుంచి ఏపీని కాపాడుకునేందుకు కేసులు, జైళ్లను లెక్క చేయమని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి, జగన్ రెడ్డికి మానవత్వం లేదు గనుకనే అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. తన సర్వేల్లో వైకాపాకు సీట్లు రావని తేలడంతోనే ప్రశాంతంగా ఉన్న ఏపీని ఫ్యాక్షన్ రాజ్యంగా జగన్ మారుస్తున్నారని నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.
సీఎం జగన్ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాజ్యంగా మారుస్తున్నారన్న నిమ్మల రామానాయుడు
Nimmala RamaNaidu గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో తాడొపేడో అన్నట్లుగా విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా సీఎం జగన్ నుంచి చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ తెదేపా నేత నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు.
సీఎం జగన్ ఏపీని ఫ్యాక్షన్ రాజ్యంగా మారుస్తున్నారు