TDP ON PRC: ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి దుర్మార్గమని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఉద్యోగులకు ఒరిగిందేంటని ప్రశ్నించారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ చరిత్రలో ఉందా అని నిలదీశారు. అశుతోష్ మిశ్రా కమిటీ సిఫారసులు ఏమయ్యాయన్నారు. తెదేపా పాలనలో 62 జీవోలిచ్చి ఉద్యోగుల సంక్షేమానికి బాటలు వేశామని స్పష్టం చేశారు. నేడు నాలుగు జీవోలతో ఆ సంక్షేమానికి బీటలు వాటిల్లేలా వ్యవహరించారని ధ్వజమెత్తారు. నాడు డీఏ 9 శాతం నుంచి 30 శాతానికి పెంచామని గుర్తు చేసిన యనమల.. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల శ్రేయస్సును దృష్ట్యా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు.
72వ డిమాండ్ వైకాపా ప్రభుత్వం అమలు చేసింది:నక్కా ఆనంద్‌బాబు