ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ధరల పెంపుపై 'తెలుగు' మహిళల నిరసన గర్జన - tdp protests on prizes news

నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. మహిళా నేతలు వంటా-వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం పెంచిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరలు తగ్గించకపోతే రాష్ట్రస్థాయిలో భారీ ఉద్యమం చేపడతామని నేతలు హెచ్చరించారు.

tdp protests
tdp protests

By

Published : Dec 7, 2020, 7:14 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. మహిళా నేతలు రోడ్లపై వంటా-వార్పు కార్యక్రమాలు నిర్వహించి నిరసన తెలిపారు. ధరలను తక్షణమే తగ్గించాలన్నారు.

నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద తెదేపా మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. వంట గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కృష్ణా జిల్లాలోని కంచికచర్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 'వంటా-వార్పు'తో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. మచిలీపట్నంలోనూ తెదేపా నాయకురాలు స్వర్ణలత ఆధ్వర్యంలో వంట-వార్పు నిర్వహించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తెదేపా మహిళా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

గుంటూరు జిల్లాలో ఇలా...

గుంటూరు ఆర్టీసీ బస్టాండు రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగు మహిళలు నిరసన చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం నేతలు వంటావార్పు నిర్వహించారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయం ఎదుట తెదేపా నేతలు వంటా-వార్పు కార్యక్రమం జరిపారు. నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి చదలవాడ అరవింద బాబు, పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి ఆధ్వర్యంలో వంట-వార్పు కార్యక్రమం చేపట్టారు.

గ్యాస్ బండతో నిరసన

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సంత చెరువు సమీపంలోని అన్న క్యాంటీన్ ఎదురుగా కాకినాడ పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ వంట-వార్పు నిర్వహించారు. కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని పార్టీ కార్యాలయం ఎదుట అరకు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు వంతల రాజేశ్వరి గ్యాస్ బండతో నిరసన తెలిపారు. రాజమహేంద్రవరంలోని అశోక థియేటర్ దగ్గర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆధ్వర్యంలో వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జవహర్ పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తెదేపా నాయకురాలు పసుపులేటి రత్నమాల ఆధ్వర్యంలో రైతు బజార్ వద్ద వంటా- వార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో రైల్వే స్టేషన్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద వంటా-వార్పు నిర్వహించారు. అలాగే పెనుకొండలోని శ్రీకృష్ణదేవరాయల కూడలిలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో నిరసన జరిగింది. హిందూపురం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఇందులో పాల్గొన్నారు. తిరుపతిలోని స్విమ్స్ రోడ్ల కూడలిలో వంట-వార్పు చేపట్టారు. తిరుపతి తెదేపా ఇంఛార్జి సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ ఇన్​ఛార్జి నరసింహ యాదవ్ పాల్గొన్నారు.

వినూత్న నిరసన

నెల్లూరులో వేదాయపాళంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట తెలుగు మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. పెరిగిన ధరతో గ్యాస్ కొనలేమంటూ కట్టెల పొయ్యిపై వంట చేసిన మహిళలు... స్థానికులకు వడ్డించారు. వైకాపా సర్కారు వచ్చిన 18 నెలల్లో నిత్యావసర సరుకుల ధరలు 200 శాతం పెరిగాయని తెదేపా నేత కూన రవికుమార్ పేర్కొన్నారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన వంటా వార్పు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్‌, గుండ లక్ష్మిదేవీ పాల్గొన్నారు. కరోనా కష్ట కాలంలో పన్నులు పెంచుతున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు దుయ్యబట్టారు. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద తెదేపా నేతలు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details