ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబుపై దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం' - tdp leaders fires on ysrcp on it raids

ఐటీ దాడుల అంశంలో వైకాపా నేతలు చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని... తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ సోదాలు జరిగిన కంపెనీకే వైకాపా ప్రభుత్వం పోలవరం టెండర్లు కట్టబెట్టిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు.

tdp leaders on it raids
వైకాపా నేతలపై తెదేపా నాయకుల మండిపాటు

By

Published : Feb 14, 2020, 7:20 PM IST

Updated : Feb 14, 2020, 7:56 PM IST

దేశంలో జరిగిన ఐటీ దాడులను చంద్రబాబుకు ముడిపెడుతున్నారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా ఆధారాలుంటే బయటపెట్టాలని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు సవాల్‌ విసిరారు. దేశం మొత్తం 40 చోట్ల ఐటీ సోదాలు జరిగాయని గుర్తు చేశారు. సోదాలు జరిగిన కంపెనీకే వైకాపా ప్రభుత్వం పోలవరం టెండర్లు కట్టబెట్టిందని విమర్శించారు. చంద్రబాబుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎనిమిదేళ్లుగా జగన్ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో చెప్పాలని కళా వెంకట్రావు ప్రశ్నించారు.

వైకాపా నేతలపై తెదేపా నాయకుల మండిపాటు

ఐటీ దాడుల్లో పట్టుబడిన డబ్బు చంద్రబాబుదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని... మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఇన్‌ఫ్రా కంపెనీల నుంచి ఏ పార్టీకి ఎంత వచ్చాయో చెప్పాలని నిలదీశారు. తన కుమారుడి కంపెనీపై దాడులు జరిగినట్లు చెబుతున్నారని... ఆ కంపెనీలో చేరి 25 రోజులే అయిందని ప్రత్తిపాటి వివరించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

ఇదీ చదవండి : 'ఐటీ సోదాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి'

Last Updated : Feb 14, 2020, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details