ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP On Amaravati: హైకోర్టు తీర్పు వైకాపా ప్రభుత్వానికి చెంపపెట్టు: తెదేపా - మూడు రాజధానుల అంశంలో వైకాపాపై తెదేపా నేతల ఆగ్రహం

TDP on High Court Judgement : హైకోర్టు తీర్పుపై తెదేపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో ఈ తీర్పు వైకాపా ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా మూడేళ్ల పాటు కాలయాపన చేశారని మండిపడ్డారు.

1
రాజధాని అంశంపై తెదేపా నేతలు

By

Published : Mar 3, 2022, 1:27 PM IST

Updated : Mar 3, 2022, 4:32 PM IST

TDP on Amaravati: రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుపై తెలుగు వర్క్​షాప్​లో తెదేపా నేతలు దేవివేని ఉమా, బచ్చుల అర్జునుడు నేతృత్వంలో రైతు కమిటీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు సీఎం జగన్​కు చెంపపెట్టు అని దేవినేని అన్నారు. మూడు రాజధానుల డ్రామాకు తెరపడిందని సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి గ్రాఫిక్స్​ ముగిసిందని విమర్శించిన బూతుల మంత్రులు క్షమాపణ చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్​ చేశారు.

TDP Leaders: రాజధాని అంశం పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పారు. హైకోర్టు తీర్పును గౌరవించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని మరో అప్పీల్​కు వెళ్లొద్దన్నారు. రాజధాని భూములు అభివృద్ధి చేసి ప్రభుత్వం రైతులకు అప్పగించాలి తెలిపారు. డివిజన్ బెంచ్ తీర్పును యథాతథంగా అమలు చేయాలని చెప్పారు.

రాజధాని అంశంపై తెదేపా నేతలు

TDP Leaders: రాజధాని తీర్పు.. అమరావతి రైతుల విజయమని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్​ అన్నారు. రాజధాని అంశంలో తెదేపా వాదనే నిజమైందని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. విభజన చట్టాన్ని పార్లమెంట్ చేసిందని.. రాష్ట్రపతి ఆమోద ముద్ర గుర్తుచేశారు.

TDP Leaders: అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ అభివృద్ధి చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రాజధాని వివాదాలకు సీఎం స్వస్తి పలకాలని.. రాజధాని రైతులపై కక్షపూరిత చర్యలు ఆపాలని హెచ్చరించారు.

పనులను పునఃప్రారంభించాలి
రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు తెలిపారు. వెంటనే అమరావతిలో నిలిచిన పనులను పునఃప్రారంభించాలన్నారు. మిగిలిన రెండేళ్లలోనైనా సీఎం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని.. తెదేపా ప్రభుత్వం తెచ్చిన 35 సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జగన్‌ వైఖరి వల్ల అనేక కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కావటం లేదని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

Last Updated : Mar 3, 2022, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details