ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికలు ఎదుర్కోవాలంటే వైకాపా నేతలకు భయం: తెదేపా

మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తెదేపా నేతలు వ్యతిరేకించారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన ఛాలెంజ్​ను తీసుకోవడానికి వైకాపా నాయకులు, జగన్ ఎందుకు ముందుకు రావడం లేదని యనమల రామకృష్ణుడు నిలదీశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు డిమాండ్ ‌చేశారు.

ఎన్నికలు ఎదుర్కొవాలంటే వైకాపా నేతలకు భయం: యనమల
ఎన్నికలు ఎదుర్కొవాలంటే వైకాపా నేతలకు భయం: యనమల

By

Published : Aug 4, 2020, 3:52 PM IST

రాజధాని విషయంపై ఎన్నికలకు సిద్ధం కావాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎదుర్కోవడానికి వైకాపా నేతలు భయపడుతున్నారని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. జగన్ అభివృద్ధి విధానాన్ని కాక విధ్వంసకర విధానాన్ని అమలు పరుస్తున్నారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. మొత్తం సమగ్రాభివృద్ధిని నాశనం చేసి అమరావతిని అభివృద్ధి చేస్తామనే వైకాపా వాదన అర్థం లేనిదని యనమల విమర్శించారు.

గత ఎన్నికల్లో ప్రజలను నమ్మించి మోసగించారు కాబట్టే, వైకాపా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు డిమాండ్‌ చేశారు. అమరావతే రాజధాని అని గతంలో చెప్పి, ఇప్పుడు దాన్ని చంపేస్తున్నారు కాబట్టే కొత్తగా ప్రజల తీర్పు కోరాలన్నారు. రాయలసీమ ప్రజలు రాజధానికి పోవాలంటే దారేదని ప్రశ్నించారు.

రాజధానిపై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలంటే రాజీనామాలు చేసి రెఫరెండం కోరాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఎన్నికల తరువాత మరో మాట మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి, వైకాపా ప్రజా ప్రతినిధులు మాట తప్పటం, మడమ తిప్పటానికి నిదర్శనంగా మారారని అన్నారు. రాజధానితో భాజపాకు సంబంధం లేదని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలా అంటారని ధూళిపాళ్ల ప్రశ్నించారు.

తెదేపా ఆధ్వర్యంలో నిరసన

రాజధానిని మార్పు చేస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజధానిగా అమరావతే ఉండాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించే మూడు రాజధానుల ప్రతిపాదన కక్ష సాధింపు చర్యగా జిల్లా నేతలు అభివర్ణించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.

ఇదీ చదవండి:ప్రజలపై నమ్మకం ఉంటే సీఎం రాజీనామా చేయాలి : చినరాజప్ప

ABOUT THE AUTHOR

...view details