తెదేపా సీనియర్ నేత బీసీ జనార్థన్ రెడ్డి అరెస్ట్‌పై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు పనిలో సీఎం జగన్ బిజీగా ఉన్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. బీసీ జనార్దన్‌రెడ్డితో పాటు ఇతర నేతల అరెస్టునూ ఖండిస్తున్నామని అన్నారు. అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జనార్దన్‌రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కరోనా నియంత్రణ వదిలేసి కక్షసాధింపులకే పరిమితమయ్యారని ఆరోపించారు. కక్షపూరితంగా అట్రాసిటీ కేసు నమోదు చేశారని.. ఇది దుర్మార్గమని దుయ్యబట్టారు. తక్షణమే జనార్దన్‌తోపాటు ఇతర నాయకులను విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.