పులిచింతల గేటు ఊడిపోవటంపై తెదేపా నాయకులు నారా లోకేశ్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు నిదర్శనమని ట్విటర్ వేదికగా దుయ్యబట్టారు.
"లక్షల క్యూసెక్కుల జలాలు సముద్రంపాలవుతున్నాయి. తండ్రి హయాంలో జరిగిన అవినీతి తనయుడి హయాంలో బయటపడటమే దేవుడి స్క్రిప్ట్." : - నారా లోకేశ్
"పులిచింతల గేటు ఎందుకు విరిగిందంటే 2003లో చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు ఇచ్చారని రాయటం మీ నీచ బుద్ధికి నిదర్శనం. పోనీ చంద్రబాబు కట్టించాడంటే అది కూడా వినకుండా మహా నేత కట్టించాడు అంటారు. సరిగ్గా నిర్వహణ చేయకుండా గాలి రాతలు రాస్తే ప్రజలు నమ్మరు." :- గోరంట్ల బుచ్చయ్యచౌదరి
ఇదీ చదవండీ..viveka murder case:వివేకా హత్యకేసులో 61వ రోజు సీబీఐ విచారణ..