రేపటి అమరావతి పర్యటన పై ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ ముగిసింది. అనంతరం మాజీమంత్రి చినరాజప్ప వివరాలు వెల్లడించారు. రాజధాని అవసరాన్ని ముఖ్యమంత్రి జగన్ గుర్తించాలని డిమాండ్ చేశారు. రాజధానిని తప్పించాలనే యోచన తప్ప జగన్‌కు మరో ఆలోచన లేదని విమర్శించారు. మంత్రి బొత్స నోటికి వచ్చినట్లు మాట్లాడి... గందరగోళం సృష్టించారని దుయ్యబట్టారు. మంత్రులు ప్రతిపక్ష నేతలుగా మాట్లాడుతున్నారన్న ఆయన... ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబుతో ముగిసిన ముఖ్య నేతల భేటీ - అమరావతిలో చంద్రబాబు పర్యటన వార్తలు
రేపటి అమరావతి పర్యటనపై ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చంద్రబాబు పర్యటన ఉంటుందని పార్టీ నేత చినరాజప్ప తెలిపారు.
tdp-leaders-meeting-over-with-chandrababu
తమ ప్రభుత్వ హయంలో అవినీతి జరిగితే విచారించి... ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటన ఖరారయ్యాక రాజధాని పనులకు అనుమతి ఇచ్చారని వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చంద్రబాబు పర్యటన ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగా చంద్రబాబు ఏం చేశారనే విషయంతో పాటు జగన్ ఆపేసిన అభివృద్ధి పనులను వివరిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి : ఏపీలో భారీ ప్రాజెక్టు... ప్రపంచ బ్యాంక్ సాయం