రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తెదేపా నేతలు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు కలిశారు. మాచర్ల, తంబళ్లపల్లి, పుంగనూరులో ఫిర్యాదులపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నామినేషన్ వేయనీయకుండా వైకాపా నేతలు హింసించిన తీరుపై చంద్రబాబు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారన్న నేతలు.. హైకోర్టు తీర్పు ప్రకారం ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దు చేయాలి: తెదేపా - AP political news
తెదేపా నేతలు వర్ల రామయ్య, బొండా ఉమ ఎస్ఈసీని కలిశారు. వైకాపా నేతల అక్రమాలపై ఫిర్యాదు చేశారు. మాచర్ల, తంబళ్లపల్లి, పుంగనూరు ఘటనలు వివరించారు. మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దు చేయాలని కోరినట్టు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఏకగ్రీవాలు జరిగాయని.. న్యాయసలహా తర్వాత చర్యలుంటాయని ఎస్‌ఈసీ చెప్పారని వర్ల రామయ్య తెలిపారు.
90శాతం గెలవకపోతే పదవులు పోతాయనే భయంతో వైకాపా నేతలు వ్యవహరించారని వర్ల రామయ్య ఆరోపించారు. గతంలో లేనంతగా ఏకగ్రీవాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. తంబళ్లపల్లెలో ఎలా ఏకగ్రీవాలయ్యాయని నిలదీశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాల్లో చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికలు రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని కోరామని, ఎస్ఈసీ న్యాయ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారని వెల్లడించారు.
ఇదీ చదవండీ... మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఎస్‌ఈసీ ఆదేశం