ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jawahar: 'అధికారుల సహకారంతో తిరువూరు ఎమ్మెల్యే ఇసుక దోపిడీ' - Kollu Ravindra Comments on YCP Leaders

ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వైకాపా నేతల తీరును మాజీ మంత్రి జవహర్(Jawahar) ఎండగట్టారు. అధికారుల సహకారంతో తిరువూరు ఎమ్మెల్యే నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారని జవహర్ ఆరోపించారు.

TDP Leaders Jawahar and kollu c
జవహర్, కొల్లు రవీంద్ర

By

Published : Jun 26, 2021, 3:18 PM IST


ఎమ్మార్వో, ఎంపీడీవో స్థాయి అధికారుల సహకారంతో తిరువూరు ఎమ్మెల్యే రక్షణానిధి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని మాజీమంత్రి జవహర్(Jawahar) ఆరోపించారు. జవహర్ మాట్లాడుతూ.. "స్థానిక యువత ఇసుక దోపిడీని ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే గన్​మెన్లు వారిని బెదిరిస్తున్నారు. స్థానికేతరుడైన ఎమ్మెల్యే బినామీ రామచంద్రారెడ్డి కట్టెలేరులో నిబంధనలకు విరుద్ధంగా రోజూ 200 ట్రాక్టర్ల ఇసుకను తోడేస్తున్నారు. గాలి జనార్థన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని చూసి వైకాపా నేతలు రాష్ట్రంలో సహజవనరులన్నింటినీ స్వాహా చేస్తున్నారు" అని ధ్వజమెత్తారు.

పరిశ్రమలను భయపెట్టి వెళ్లగొడుతున్నారు: కొల్లు రవీంద్ర

చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలను వైకాపా నేతలు భయపెట్టి రాష్ట్రం నుంచి వెళ్లగొడుతున్నారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ధ్వజమెత్తారు. వీడియో సందేశం ద్వారా ఆయన మాట్లాడుతూ.. "జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్లే పరిశ్రమలు ఏపీకి గుడ్ బై చెప్తున్నాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా.. ఉన్నవాటిని వెల్లగొడుతూ యువతకి ఉపాధి దూరం చేస్తున్నారు. రూ. వేల కోట్ల పెట్టుబడులు తరలిపోతుంటే ఏపీఐఐసీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి ఏం చేస్తున్నారు. వాలంటీర్ ఉద్యోగాల కోసమే యువత ఎదురు చూడాలా... పెట్టుబడుల్లో ఏపీని తెదేపా ప్రభుత్వం రెండో స్థానంలో నిలబడితే.. వైకాపా సర్కార్ 16వ స్థానానికి దిగజార్చింది" అని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

ARREST: వేడుకలో వ్యభిచారం.. ఐదుగురు వ్యక్తులు అరెస్ట్!

ABOUT THE AUTHOR

...view details