ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ ఆస్పత్రులను సందర్శించకుండా.. తెదేపా నేతల గృహ నిర్బంధం - తెలుగుదేశం నేతల హౌస్ అరెస్ట్ వార్తలు

Tdp leaders house arrest
రాష్ట్రంలో పలుచోట్ల తెదేపా నేతల గృహనిర్బంధం

By

Published : May 24, 2021, 8:14 AM IST

Updated : May 24, 2021, 10:03 AM IST

08:10 May 24

ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు

తెదేపా నేతల గృహ నిర్బంధం

రాష్ట్రంలోని కొవిడ్ ఆస్పత్రుల్లో సౌకర్యాలను పరిశీలించేందుకు తెలుగుదేశం పిలుపునిచ్చిన 'కొవిడ్ బాధితులకు భరోసా' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రుల సందర్శనకు వెళ్తున్న తెదేపా నేతలను గృహ నిర్బంధం చేశారు.

పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌, కడప జిల్లాలో బీటెక్ రవిని హౌస్ అరెస్ట్ చేశారు. ఏలూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలను సైతం పోలీసులు గృహనిర్బంధం చేశారు.

జీజీహెచ్ వద్ద..

గుంటూరులో జీజీహెచ్ వద్ద తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ అంజనేయులును పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు ఆయనతో పాటు.. పార్టీ నేతలు ప్రయత్నించగా పోలీసులు అంగీకరించలేదు. ఆగ్రహించిన తెదేపా నేతలు.. జీజీహెచ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయనగరంలో...

మహారాజ కోవిడ్ ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుతున్నా.. బ్లాక్ ఫంగస్‌తో ఆందోళన

Last Updated : May 24, 2021, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details