రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం ముఖ్యనేతలు ఇవాళ కర్నూలులో సమావేశం కానున్నారు. భేటీకి 10 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, నేతలు హాజరు కానున్నారు. కేఆర్‌ఎంబీ పరిధి, ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్ర గెజిట్‌ను పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో.. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుల వరకు మాత్రమే గెజిట్‌ను పరిమితం చేయాలని సీమ ప్రాంత తెదేపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. గెజిట్ కారణంగా రాష్ట్ర పరిధిలో స్థానికంగా నీటి పంపిణీకి ఇబ్బంది ఎదురవుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తెదేపా రాయలసీమ నాయకుల సమావేశం.. - తెదేపా రాయలసీమ నాయకుల సమావేశం
కేఆర్‌ఎంబీ పరిధి, ప్రాజెక్టుల నిర్వహణను వ్యతిరేకిస్తూ.. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన తెదేపా నాయకులు సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుల వరకు మాత్రమే గెజిట్‌ను పరిమితం చేయాలని సీమ ప్రాంత తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
నికర జలాలు లేని హంద్రీనీవా, గాలేరు నగరి వంటి కాలువలకు ఇబ్బందేనని వాదిస్తున్న వారు.. దీనికి తుంగభద్ర బోర్డు పరిధిని ఉదాహరణగా చూపెడుతున్నారు. స్థానికంగా, అవసరాల వారీగా కాకుండా.. ప్రాజెక్టులు, ప్రాంతాల వారీగా నీటి పంపకాల వల్ల కొత్త తలనొప్పులు వస్తాయని.. కాలువల కింద అవసరాలకు కాకుండా నిబంధనల ఆధారంగా నీటి విడుదల నష్టమని పేర్కొంటున్నారు. గోదావరి జలాలను కృష్ణకు మళ్లించి.. ఎగువన సీమకు నీటి కేటాయింపు చేస్తున్న విధానాలకు ముప్పు వాటిల్లుతుందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో భేటీలో ఈ అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు.
ఇదీ చదవండీ..విశాఖ భూ కుంభకోణంపై సిట్ నివేదికలో పేర్లు బయటపెట్టాలి: ఎంపీ రఘురామ