వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ వేదికగా మద్దతు పలికిన వైకాపా.. ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేస్తోందంటూ తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలపై వైకాపా ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు మాట్లాడిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
"రైతుల పట్ల వైకాపాది కపట ప్రేమ. తన కేసుల మాఫీ కోసం రైతుల ప్రయోజనాలను జగన్ దిల్లీలో తాకట్టు పెట్టారు. తెదేపా నాడు ప్రతిపాదించిన సవరణలనే నేడు కోరుతోంది. జే-టర్న్ తీసుకున్న వైకాపా నేతలు వంకర టింకరగా వ్యవహరిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు." -అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు