తెదేపాపై అసత్య ప్రచారం చేస్తూ వైకాపా నాయకులు దొరికిపోయారని తెదేపా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ దుయ్యబట్టారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడుల్లో దొరికింది 2 లక్షల 63 వేల రూపాయలు అని... అది కూడా తిరిగి ఇచ్చేశారని ఆయన గుర్తుచేశారు. 2 లక్షలకు మరికొన్ని సున్నాలు కలిపి 2 వేల కోట్లు చేసి వారి సొంత మీడియాలో అసత్య కథలు అల్లారని మండిపడ్డారు. ఆఖరికి ఐటీ పంచనామాతో జగన్ అసత్య ప్రచారానికి పంచర్ పడిందని ట్వీట్ చేశారు.
ప్రకటన చేయగలరా..?
చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్లు దొరకాయంటూ వైకాపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత తెనాలి శ్రావణ్ మండిపడ్డారు. ఐటీ తనిఖీల పంచనామా నివేదిక ఉందని ప్రకటించగలరా అని ప్రశ్నించారు. తనీఖీల్లో దొరికిన డబ్బును శ్రీనివాస్ కుమార్తె పెళ్లి కోసం సిద్ధం చేసుకున్నారని వివరించారు.