TDP LEADERS FIRES: కాపుల పట్ల ప్రభుత్వ చర్యలు ఇలాగే ఉంటే.. మళ్లీ పెద్దఎత్తున ఉద్యమం మొదలవుతుందని తెదేపా నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. కాపులను చంద్రబాబు మోసం చేశారని.. జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతో జగన్ రెడ్డి కాపులకు చేయంది.. చేసినట్లుగా చెప్పుకుంటూ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గొల్లప్రోలులో కాపుల గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యాలేనని స్పష్టం చేశారు.
"ప్రభుత్వ చర్యలు ఇలాగే ఉంటే..మళ్లీ కాపు ఉద్యమం" - జగన్ వ్యాఖ్యలను ఖండించిన తెదేపా నేతలు
TDP LEADERS FIRES: కాపుల గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యాలేనని తెలుగుదేశం నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రు విమర్శించారు. కాపులకు రూ.వెయ్యి కోట్లు బడ్జెట్‌లో పెట్టి ఖర్చు చేసిన ఘనత చంద్రబాబుదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు రద్దు చేసింది జగన్ ప్రభుత్వమని మండిపడ్డారు.
TDP LEADERS FIRES
బడ్జెట్‌లో కాపులకు వెయ్యికోట్లు పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన 5శాతం రిజర్వేషన్ రద్దు చేసింది జగన్ అని దుయ్యబట్టారు. కాపులకు రూ.15వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి అమలు చేస్తున్న కాపు నేస్తం ఓ బూటకమని.. కాపులకు విదేశీ విద్య, కార్పొరేషన్ ద్వారా రుణాలు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తే, జగన్ రెడ్డి వాటిని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: