ప్రపంచమంతా కరోనా నియంత్రణపై చర్యలు చేపడుతుంటే....రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతుందని తెదేపా నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్ధించిన తర్వాత కూడా మంత్రులు, వైకాపా నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయస్థానాలంటే గౌరవం లేదా అని ప్రశ్నించారు.
సామాన్యుల పరిస్థితి ఏంటీ..?: చినరాజప్ప
రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌కే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితేమిటని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. వైకాపాది అరాచక ప్రభుత్వమని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం వైకాపా అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. కేంద్ర బలగాల సాయంతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వ చర్యలు శూన్యమన్న ఆయన... ప్రజల ప్రాణాలకంటే సీఎం జగన్‌కు ఎన్నికలే ముఖ్యమని విమర్శించారు.