ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయి: తెదేపా - tdp leaders fire on ycp governament

74 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఇంకా కూడా ఎస్సీలపై దాడులు జరగటం దురదృష్టకరమని తెదేపా నేతలు అన్నారు. గుంటూరులో నిరసన దీక్ష చేపట్టిన మాజీ మంత్రులు ఆనందబాబు, ఆలపాటి రాజా.. వైకాపా పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

tdp
tdp

By

Published : Aug 15, 2020, 4:58 PM IST

స్వాతంత్య్రం వచ్చిన 74ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రంలో ఎస్సీలు దాడులకు గురి కావటం దురదృష్టకరమని మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలపై ఇటీవలి కాలంలో జరిగిన దాడులను నిరసిస్తూ గుంటూరులోని తెదేపా కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

కచ్చులూరు బోటు ప్రమాదం గురించి మాట్లాడితే మాజీ ఎంపీ హర్షకుమార్​ని, మాస్కులు లేవని అడిగితే డాక్టర్ సుధాకర్​ని, ఇసుక మాఫియాను అడ్డుకుంటే ప్రసాద్​ను ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ఆనందబాబు గుర్తు చేశారు. దాడుల గురించి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని... ఇలా ఎంతమందిని అరెస్టు చేస్తారని..? ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగటం లేదని ఆలపాటి రాజా విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమైనా రాజ్యాంగ పరిధిలోనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని... కానీ జగన్ ప్రభుత్వానికి అవేమీ పట్టడం లేదని ఆరోపించారు. మన రాష్ట్రంలో అతిపెద్ద ప్రజాద్రోహిగా ముఖ్యమంత్రి అని అభివర్ణించారు.

కేసులతో వేధిస్తున్నారు

దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరులో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన.... ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు వేయించుకొని ఇవాళ వారిపైనే దాడులు చేస్తున్నారని విమర్శించారు. శిరోముండనం వంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న తెదేపా నేతలపై అక్రమ కేసులు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

తండ్రి వివాహేతర సంబంధం తెలిసి కుమారుడు ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details