రాష్ట్ర ఆస్తులన్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి సీఎం జగన్... మిషన్ బిల్డ్ ఏపీ అని పేరు పెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఆ కార్యక్రమం పేరు మిషన్ బిల్డ్ ఏపీ కాదు జగన్ కిల్డ్ ఏపీ అని దుయ్యబట్టారు.
దోచుకోవడానికే...
విశాఖలో జగన్ దోచుకున్న వేలాది ఎకరాల భూములకు రేట్లు రావడం కోసమే మిషన్ బిల్డ్ ఏపీ కార్యక్రమాన్ని తెచ్చారని.. మరో మాజీ మంత్రి దేవినేని ఉమా ఆక్షేపించారు. సంపద సృష్టి చేతకాక ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను అమ్మే అధికారం ఎవరు ఇచ్చారని నిలదీశారు. ఇది బిల్డ్ ఏపీనా.. లేక సెల్ ఏపీనా అని ప్రజలు అడుగుతున్న దానికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.