వైకాపా పాలనలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారైందని మాజీ మంత్రి, తెదేపా నేత జవహర్ ఆరోపించారు. తెదేపా హయాంలో కట్టిన పాఠశాల భవనాలకు నేడు రంగులేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో విశ్వవిద్యాలయం స్థాపిస్తే... ఆ పేరుకు అదనంగా ఆంధ్రకేసరి అనే పదాన్ని జోడించి మళ్లీ ప్రారంభించారని ఆక్షేపించారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో విద్యావ్యవస్థలో నాడు ఏపీ మూడో స్థానంలో ఉంటే నేడు 19వ స్థానానికి పడిపోయిందని జవహర్ ఆవేదన వ్యక్తం చేశారు. అనుచరులకు నిధులు సమకూర్చేందుకు నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారని ధ్వజమెత్తారు. 80లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన అమ్మఒడిని 40లక్షల మంది విద్యార్థులకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. విద్యాశాఖలో మార్పుల కోసం ఇకనైనా పద్ధతి మార్చుకుని, మేథావులు, నిపుణులు, తల్లిదండ్రుల సూచనలు తీసుకోవాలని జవహర్ హితవు పలికారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వండి...
స్వామివారి భూములు, బంగారు అభరణాలు, ఇతర సంపదపై జగన్ రెడ్డి కన్ను పడిందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య అన్నారు. అందుకే హిందూయేతరులతో తితిదే పాలకమండలి ఏర్పాటు చేసి, కాలపరిమితి ముగిశాక స్పెసిఫైడ్ అథారిటీ పేరుతో తనకు అనుకూలంగా ఉండే ఇద్దరు దేవస్థానం ఉద్యోగుల్ని సభ్యులుగా పెట్టారని ఆరోపించారు. స్పెసిఫైడ్ అథారిటీని రద్దు చేసి, 19మంది హిందువులతో పాలకమండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ వేయించుకోని 45ఏళ్ల పైబడిన తితిదే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వమని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయ లబ్ధి కోసమే...
రాజకీయ లబ్ధి కోసమే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలవివాదంపై డ్రామాలు ఆడుతున్నారని మాజీమంత్రి ఆలపాటి రాజా దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే జలవివాదానికి తెరలేపారని ఆక్షేపించారు. ప్రతిపక్ష నేతలపై అనవసరంగా నోరు పారేసుకునే ఏపీ మంత్రులు... తెలంగాణ మంత్రులు రెచ్చగొడుతున్నా నోరు మెదపకపోవటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకే జగన్రెడ్డి కేసీఆర్ వద్ద ఏపీ హక్కుల్ని బలిపెడుతున్నారని ఆలపాటి రాజా అన్నారు.
వివరాలు బయటపెట్టండి...