ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అలాంటి వారిని చూసి చప్పట్లు కొట్టాలా...? తెదేపా - ఏపీలో వాలంటీర్ వ్యవస్థ వార్తలు

వాలంటీర్ వ్యవస్థ వల్ల అనేక చోట్ల మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, ప్రభుత్వ పథకాల్లో చేతివాటం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ ఆరోపించారు. ఇలాంటి వ్యవస్థలను చూసి చప్పట్లు కొట్టాలా...? అని ప్రశ్నించారు.

tdp
tdp

By

Published : Oct 2, 2020, 5:22 PM IST

వాలంటీర్ వ్యవస్థపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలను వేధిస్తూ... ప్రజలను వెంటాడుతున్న వాలంటీర్లకు చప్పట్లు కొట్టాలా...? అని దుయ్యబట్టారు. వాలంటీర్ వ్యవస్థతో అనేక చోట్ల మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, దాడులు, పింఛన్ డబ్బులో చేతివాటం లాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయని ట్విటర్​లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ సమాధానం చెప్పాలి..

ఏడాదిగా వాలంటీర్ల అరాచకాలకు సంబంధించిన ఓ వీడియోను మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ట్విటర్ లో విడుదల చేశారు. బాలిక పై అత్యాచారం, వృద్ధురాలి మెడలో గొలుసు దొంగతనం, నాటు సారా కాయటం, అక్రమ మద్యం తరలింపు, మహిళ పై హత్యాయత్నం, లాంటి దుర్మార్గాలకు వాలంటీర్లు పాల్పడ్డారని అందులో ఆరోపించారు. అలాంటి వారికి చప్పట్లు కొట్టాలా..? చెట్టుకి కట్టేసి కొట్టాలో జగన్ సమాధానం చెప్పాలని బండారు మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఐదు సీట్లే...!

తెలుగుదేశానికి 23 సీట్లు రావడం దేవుడి స్క్రిప్ట్ అంటున్న విజయసాయిరెడ్డి... ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలను కొన్నామని ప్రకటిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. అంటే వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలిచేది 5 సీట్లే అని ఫిక్సైనట్టున్నారని ఎద్దేవా చేశారు. విజయసాయి రెడ్డి మాటలు వింటుటే కరోనా ఎఫెక్ట్ తో మైండ్ కూడా దెబ్బతిన్నట్టు కనిపిస్తోందన్నారు.

ఇదీ చదవండి

'మా పార్టీకి సిద్ధాంతాలున్నాయి.. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details