ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చేయూతలో దళిత మహిళలకు జగన్ రెడ్డి ద్రోహం' - చేయూత పథకంపై నజీర్ అహ్మద్ కామెంట్స్

చేయూత పథకంపై తెదేపా నేతలు డోలా వీరాంజనేయస్వామి, నజీర్ అహ్మద్​లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం దళితలను వాడుకుంటున్నారని డోలా ఆరోపించారు.

Dola and Nazeer
Dola and Nazeer

By

Published : Jun 22, 2021, 8:03 PM IST


జగన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం దళితలను వాడుకుంటున్నారని తెదేపా శాసనసభ పక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం మహిళా సంక్షేమంలోనూ చేతివాటం చూపుతూ..దళిత మహిళలకు జగన్ రెడ్డి ద్రోహం చేశారని ఆరోపించారు. చేయూత ద్వారా ప్రతి ఎస్సీ మహిళకు రూ.3వేలు పింఛన్​ ఇస్తానని ఓట్లు వేయించుకుని.. అధికారంలోకి రాగానే మోసం చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. కోటి మందికి దక్కాల్సిన పథకాన్ని 23లక్షల మందికే కుదించటం నమ్మకద్రోహమని, ఓట్ల కోసం నాడు నెత్తిన చెయ్యి పెట్టి నేడు తడిగుడ్డతో గొంతు కోశారు. ప్రకటనలకు ఖర్చు చేసిన దాంతో పోల్చితే చేయూత ద్వారా ఎస్సీ మహిళలకు అందింది తక్కువేనని ఆక్షేపించారు.

వైఎస్సార్ చేయూత పేరుతో జగనన్న కోత..

వైఎస్సార్ చేయూత పేరుతో జగనన్న కోత విధించారని తెదేపా అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్ మండిపడ్డారు. చేయూత పేరుతో మైనార్టీ మహిళల్ని మోసం చేసేందుకు జగన్ రెడ్డికి మనసెలా వచ్చిందని నిలదీశారు. ఓట్లేసేందుకు తప్ప పథకాల లబ్ధికి మైనార్టీలు పనికిరారన్నట్లు వ్యవహరిస్తున్నారు. మైనార్టీ సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం చేసింది శూన్యమని, రాష్ట్రంలో ఉన్న మైనార్టీ మహిళల సంఖ్యకు ప్రభుత్వం అందిస్తున్న సాయానికి ఎంతో వ్యత్యాసం ఉందని మండిపడ్డారు. మైనార్టీలు జగన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

సందడిగా బస్టాండ్లు.. కొవిడ్ నిబంధనలతో ప్రయాణాలు..

ABOUT THE AUTHOR

...view details