అచ్చెన్నాయుడు అరెస్టును తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఖండించారు. కక్షపూరితంగా బీసీ నాయకుడిని అరెస్టు చేశారని మండిపడ్డారు.
విచారణ జరపాలి, ఆ తర్వాత నోటీసు ఇవ్వాలి కానీ... ఎలాంటి విచారణ, నోటీసులు లేకుండా అరెస్టు చేస్తారా?. కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తారా?. బీసీలంటే ఇంత చులకనభావమా..? ఇలా చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. ......మాజీమంత్రి సోమిరెడ్డి
కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ఆలపాటి రాజా మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడి చేయడం కక్షసాధింపేనన్నారు.
బడుగు, బలహీనవర్గాలను అణిచివేసే నియంత పాలనకు పరాకాష్ట.. జగన్ ప్రభుత్వమని బుద్దా వెంకన్న విమర్శించారు. కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని దుయ్యబట్టారు.
అచ్చెన్నాయుడి అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఎదుగుతున్న నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించడం కుట్ర కాదా? అని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చి వివరణ కూడా ఇవ్వకుండా అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు. బలహీనవర్గాల నాయకులను అణగదొక్కే కుట్రలో భాగమేనని అన్నారు.
ఇదీ చదవండి:లైవ్ అప్డేట్స్: 'కక్షసాధింపులో భాగంగానే అచ్చెన్నాయుడి అరెస్టు'