ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దాడి ఘటనపై తుళ్లూరు పోలీస్​స్టేషన్​లో తెదేపా ఫిర్యాదు - అమరావతిలో చంద్రబాబు పర్యటన

చంద్రబాబు కాన్వాయ్​పై రాళ్ల దాడి ఘటన గురించి తెదేపా నేతలు తుళ్లూరు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న తమ నాయకుడు కాన్వాయ్ వస్తున్న సమయంలో... నిరసనల ప్రదర్శనలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.

tdp leaders complaint to tulluru police
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న తెదేపా నేతలు

By

Published : Nov 29, 2019, 8:43 PM IST

మీడియాతో నిమ్మల రామానాయుడు

తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు కాన్వాయ్​ మీద... దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తెదేపా శాసనసభపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు తుళ్లూరు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న తమ నాయకుడు కాన్వాయ్ వస్తున్న సమయంలో... నిరసనల ప్రదర్శనలకు ఎలా అనుమతి ఇచ్చారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు జిల్లాల పర్యటన సమయంలో సెక్షన్ 30 అమలు చేస్తున్న పోలీసులు... గురువారం ఆ పని ఎందుకు చేయలేదని నిలదీశారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

సంబంధిత కథనం

ABOUT THE AUTHOR

...view details