రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వాలంటీర్ల ప్రచారానికి సంబంధించిన ఫొటో, వీడియోలను ఆధారాలుగా ఫిర్యాదు లేఖలకు జతచేసింది. కుప్పం, నెల్లూరు, కొండపల్లిలో వాలంటీర్లు, ఉద్యోగ సంఘ నాయకులు అధికార పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని.. ఆరోపించింది. కృష్ణా జిల్లా కొండపల్లి మునిస్పాలిటీకి జరిగే ఎన్నికల్లో రేషన్ డీలర్ నాగరాజు 1వ వార్డులో వైకాపా అభ్యర్థి చంద్రశేఖర్‌కు అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 12వ వార్డులో వార్డు వాలంటీరు అశ్విని వైకాపా అభ్యర్థి ఆనంద్‌కు , 5వ వార్డులో వాలంటీర్ అశ్విని అభ్యర్థి దయాకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. కడప జిల్లా రాజంపేట, కమలాపురంలో ప్రభుత్వ సలహాదారు, ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఈ నెల 11వ తేదీన ఉద్యోగులతో సమావేశం నిర్వహించి వైకాపాకు ఓటు వేయాలని కోరినట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వార్డ్ వాలంటీర్లు దివ్య, సోనియా, దివ్య భారతిలు వైకాపాకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఎమ్మెల్సీలు అశోక్ బాబు, బీటెక్ రవిలు తమ ఫిర్యాదు లేఖల్లో పేర్కొన్నారు.
TDP complaint to SEC: 'ప్రచారం నిర్వహిస్తున్న వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలి' - election campaign
రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పలు ప్రాంతాల వాలంటీర్లపై తెదేపా నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా వారు ఎన్నికల్లో పాల్గొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెదేపా నేతలు
Last Updated : Nov 13, 2021, 4:11 AM IST