ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెదేపా నేతల అరెస్టులు వైకాపా ఆడుతున్న రాజకీయ క్రీడ'

మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్టులు వైకాపా సర్కార్ ఆడుతున్న రాజకీయ క్రీడ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. 15 నెలల్లో 93 సార్లు కోర్టులు వైకాపా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందన్నారు. అచ్చెన్నాయుడు విడుదలపై ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. రాజకీయ వేధింపులతో కేసులు పెట్టినా వాటిని న్యాయబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

తెదేపా నేతల అరెస్టులు వైకాపా ఆడుతున్న రాజకీయ క్రీడ
తెదేపా నేతల అరెస్టులు వైకాపా ఆడుతున్న రాజకీయ క్రీడ

By

Published : Aug 29, 2020, 4:35 AM IST

తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రులు అయిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్టులు వైకాపా సర్కారు ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగమేనని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. న్యాయ స్థానాలు లేకపోతే తమలాంటోళ్లు జగన్ పాలనలో బతకడం కూడా కష్టమే అని విమర్శించారు. 15 నెలల్లో 93 సార్లు కోర్టులతో చివాట్లు తిన్నా వైకాపా సర్కారుకి బుద్ధి రాలేదని దుయ్యబట్టారు.

అచ్చెన్నాయుడు విడుదలపై స్పందించిన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు.. స్వచ్ఛమైన రాజ‌కీయ జీవితంలో మ‌చ్చలేని నాయకుడిపై రాజ‌కీయ వేధింపుల‌తో కేసులుపెట్టినా వాటన్నింటినీ న్యాయబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. బెయిల్ వ‌చ్చినా అచ్చెన్నాయుడికి క‌రోనా పాజిటివ్ నిర్ధర‌ణ కావ‌డంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఎవరూ పరామర్శకు రావొద్దని రామ్మోహన్‌ చెప్పారు. క‌ష్టకాలంలో తమ కుటుంబానికి అండ‌గా నిలిచిన తెదేపా అధినేత చంద్రబాబు, నేత‌లు, కార్యక‌ర్తలంద‌రికీ రామ్మోహన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి :రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. 4 లక్షలు దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details