జగన్ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. జగన్ పాలనని ప్రశ్నించినందుకే సబ్బంహరి ఇంటిని కూల్చివేస్తున్నారని ఆరోపించారు. కూల్చాల్సింది ప్రతిపక్ష నాయకుల ఇళ్లు కాదు.. జగన్‌లోని అహం అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి హితవు పలికారు. 16 నెలలుగా జగన్ అరాచకాలను ఎండగట్టినందుకు సబ్బంహరిపై కక్ష సాధిస్తారా.. అని నిలదీశారు. సబ్బంహరి ఎలాంటి వ్యక్తో రాష్ట్ర ప్రజలకు తెలుసన్న ఆయన.. అధికార బలంతో నోరు నొక్కాలని చూస్తే వెయ్యి అడుగులు ముందుకేస్తామని స్పష్టం చేశారు.
వైకాపా పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు: అయ్యన్న పాత్రుడు - ప్రభుత్వంపై తెదేపా నేతలు ఆగ్రహం
సీఎం జగన్ పాలనలో అభివృద్ధి లేదని తెదేపా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకే సబ్బంహరి ఇల్లు కూల్చివేస్తున్నారని ఆరోపించారు. సబ్బంహరిపై కక్ష సాధిస్తారా అంటూ.. బండారు సత్యనారాయణ ప్రభుత్వాన్ని నిలదీశారు.
tdp leaders