మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతిని పురస్కరించుకొని.. తెదేపా నాయకులు చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లు నివాళులర్పించారు. దేశానికి శాస్త్ర, సాంకేతికపరమైన ఎన్నో విజయాలను అందించి మిస్సైల్ మాన్‌గా గుర్తింపును పొందినప్పటికీ తన నిరాడంబరతతో విశిష్ట లక్షణాలతో ప్రజల రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్‌కలాం పిలువబడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు. అబ్దుల్‌కలాం మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన జీవితం అందించిన స్ఫూర్తి.. భవిష్యత్ తరాల విజయాలకు వెలుగుబాటగా నిలుస్తుందని లోకేశ్ కొనియాడారు.
అబ్దుల్ కలాంకు చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి.. - Abdul Kalam Varthanthi latest news
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతిని పురస్కరించుకొని.. తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లు నివాళులర్పించారు. అలాగే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెదేపా నాయకులు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు చంద్రబాబు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఆరోగ్యంతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండీ.. Mansas Trust: చైర్మన్ ఆదేశాలు పాటించాల్సిందే: మాన్సాస్ ట్రస్టు ఈవోకు హైకోర్టు ఆదేశం