ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమ్మఒడిలో లొసుగులు అనంతం.. ఈ పాపం ఊరికే పోదు' - tdp leader ayyanna patrudu news

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అమ్మఒడి పథకాన్ని పావుఒడిగా మార్చారని అయ్యన్న వ్యాఖ్యానించగా... నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో సర్కార్ ఆటలాడుతోందని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు.

TDP LEADERS
TDP LEADERS

By

Published : Dec 24, 2020, 11:05 AM IST

అమ్మ ఒడి పథకంలోని లొసుగులు అనంతమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రతి బిడ్డకు అమ్మఒడి అని, గెలిచిన తరువాత దానిని అర్ధ ఒడి చేశారని విమర్శించారు. ఇప్పుడు అర్ధ ఒడిని సగం నరికి ఆంక్షల పేరుతో పావుఒడి చేస్తున్నారని అన్నారు. చిన్న పిల్లలు, తల్లులని ఆశ పెట్టి వంచించిన పాపం ఊరికే పోదని ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అయ్యన్న ట్వీట్ చేశారు.

మరోవైపు మద్య నిషేధం అంటూ గద్దెనెక్కిన సీఎం జగన్.. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా 25 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. మహిళల పుస్తెలు సైతం వదలకుండా లాగేస్తున్న జగన్ రెడ్డి, సాయి రెడ్డి పాపం పండే రోజు దగ్గర్లోనే ఉందని ట్విట్టర్​లో విమర్శలు గుప్పించారు.

ABOUT THE AUTHOR

...view details