విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సీఎం జగన్ ఆమోదంతోనే ఒప్పందం జరిగిందని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. కేంద్రమంత్రి స్వయంగా చెప్పడంతో జగన్ నిజస్వరూపం బట్టబయలైందన్నారు. ప్రైవేటుపరం చేసి వాటాల కోసం యత్నించడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
ప్రత్యేక విమానంలో విశాఖ వరకూ వచ్చి స్వామీజి కాళ్లుమొక్కిన సీఎం జగన్కు.. స్టీల్ ప్లాంట్ వరకూ వెళ్లి కార్మికులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చే తీరిక లేదా అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ప్రైవేటీకరణకు సూత్రధారి విజయసాయిరెడ్డే పాదయాత్ర చేస్తాననడం ఆశ్చర్యకరమని అన్నారు. విజయసాయిరెడ్డి.. చేతనైతే సీఎంతో కలిసి దిల్లీలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. చీకటి ఒప్పందం బయటపడుతుందనే ప్రధాని వద్దకు వెళ్లలేకపోతున్నారా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.