కరకట్ట వద్ద ప్రభుత్వం కూల్చివేయించిన ప్రజావేదిక ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెలుగుదేశం నేతలను..... పోలీసులు అరెస్టు చేశారు. నేతల రాక సమాచారంతో... పోలీసులను భారీగా మోహరించారు. ప్రజావేదిక వద్దకు వచ్చే 4 రహదారుల్లో.... చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తెలుగుదేశం నేతల వాహనాలు మినహా మిగతా వాహనాలను అనుమతించారు. ప్రజావేదిక వద్దకు వెళ్తున్న పార్టీ సీనియర్ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, రాజేంద్రప్రసాద్, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య సహా ఇతర నేతలను.... అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై నేతలు మండిపడ్డారు. పోలీసులు, తెలుగుదేశం నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో... నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజావేదిక ప్రాంగణాన్ని పరిశీలించి.... వెంటనే తిరిగి వచ్చేస్తామని నేతలు వివరించినా.. పోలీసులు వినిపించుకోలేదు. వెంట మీడియాను ఎందుకు తీసుకొచ్చారని.. ప్రశ్నించారు.
వారికి చిటికెలో పని..
ఒక భవనం కట్టడం ఎంత కష్టమో.. కూలగొట్టడం చిటికెలో పనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఇది తెలిసి కూడా జగన్ రెడ్డి విధ్వంసానికే జై కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అంటే నవ్యాంధ్ర నిర్మాతని, జగన్‌రెడ్డి అంటే నవ్యాంధ్ర నాశనానికి కంకణం కట్టుకున్న అరాచక పాలకుడని ప్రజావేదిక శిథిలాలు.. సాక్ష్యం చెబుతున్నాయని లోకేశ్ ధ్వజమెత్తారు. తెదేపా నేతల అరెస్టులను ఆయన ఖండించారు.
ప్రజాధనం మట్టిపాలు