కొండపల్లిలో అక్రమ మైనింగ్ పై నిజనిర్థరణ నిమిత్తం బయల్దేరిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బలవంతంగా అరెస్టు చేశారు. వంగలపూడి అనిత, నల్లమిల్లి రామకృష్ణారెడ్డితోపాటు.. పార్టీ కార్యకర్తలను సైతం అదుపులోకి తీసుకుని.. వాహనంలో అక్కడి నుంచి తరలించారు.
పోలీసుల తీరును నేతలంతా తప్పుబట్టారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తప్పు జరగకుంటే.. తమను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై.. అక్రమ మైనింగ్ పై పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.