ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకోవాలి: తెదేపా

By

Published : May 29, 2020, 12:47 PM IST

మాజీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్​ను తిరిగి ఎన్నికల కమిషనర్​గా నియమించాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును తెదేపా నేతలు స్వాగతించారు. నిమ్మగడ్డను తొలగించాలనే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు గుణపాఠం అన్నారు.

ఎస్​ఈసీపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : తెదేపా
ఎస్​ఈసీపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : తెదేపా

హైకోర్టు తీర్పుతోనైనా వైకాపా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు హితవుపలికారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్​ పునర్నియామకంపై హైకోర్పు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ ఏ తప్పూ చేయలేదని మొదటినుంచి చెప్పినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లిందని ఆరోపించారు.

రాజ్యాంగ నిబంధనలను హైకోర్టు సమర్థించిందని శాసన మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రమేశ్‌కుమార్‌ను తప్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని ఆయన స్వాగతించారు. వైకాపా ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బన్న యనమల... ఇకనైనా పద్దతి మార్చుకోవాలని హితవుపలికారు.

ఇదీ చదవండి :హైకోర్టు తీర్పుపై నేతల స్పందన

ABOUT THE AUTHOR

...view details