ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP LEADERS : 'మాపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టేయండి' - TDP leaders appeal petition on high court

తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ 11 మంది తెదేపా నేతలు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎఫ్​ఐఆర్ 922/2021ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని కోరారు. పెడన వైకాపా శాసనసభ్యుడు జోగి రమేశ్ తన అనుచరులతో చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించిన ఘటనలో పరస్పర దాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

By

Published : Sep 22, 2021, 2:25 AM IST

తాడేపల్లి పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు, ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను కొట్టివేయాలని కోరుతూ తెదేపా నేతలు 11మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అధికార ప్రతినిధి పట్టాభిరామ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జంగాల సాంబశివరావు, నాగుల్​మీరా, నాదెళ్ల బ్రహ్మయ్య, సుంకర విష్ణుకుమార్, తదితరులు ఈ వ్యాజ్యం దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఎఫ్​ఐఆర్ 922/2021ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని కోరారు.

పెడన వైకాపా శాసనసభ్యుడు జోగి రమేశ్ తన అనుచరులతో చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించిన ఘటనలో పరస్పర దాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు డ్రైవర్ తాండ్ర రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 'ఫిర్యాదిదారు రామును తాము ఎప్పుడూ చూడలేదు. ఏ సామాజికవర్గానికి చెందిన వారో మాకు తెలియదు. అలాంటిది మాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు సరికాదు. ప్రతిపక్ష నేతలపై పోలీసులు తప్పులు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. వాస్తవానికి ఫిర్యాదిదారు మరికొందరు జోగి రమేశ్ నేతృత్వంతో చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో బాధితులుగా మారింది మేము. పోలీసులు మాపై తప్పుడు కేసు నమోదు చేశారు. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని మాపై పెట్టిన కేసును కొట్టేయండి'. అని వారు వ్యాజ్యంలో కోరారు.

ఇదీచదవండి.

Department of Mines: ప్రైవేట్ వ్యక్తులకు గనుల సినరేజీ వసూళ్ల బాధ్యత!

ABOUT THE AUTHOR

...view details