2 రోజుల సమావేశాలు.. సొంత అజెండా అమలుకే: తెదేపా - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
2 రోజుల పాటే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సొంత అజెండాను అమలు చేసుకునేందుకే అసెంబ్లీ సమావేశాలను కేవలం రెండు రోజులకే పరిమితం చేశారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. సమావేశాలకు నల్లచొక్కాలతో హాజరు కావాలని నిర్ణయించామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాసమస్యలు చర్చించేందుకు కనీసం 15 రోజుల పాటైనా అన్ని జాగ్రత్త చర్యలతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏడాదిలో ప్రజాధానం దోచుకునేందుకే సంక్షేమం పేరుతో నాటకాలు ఆడుతున్నారని నేతలు దుయ్యబట్టారు. సభలో మాట్లాడే అవకాశం వచ్చినా రాకపోయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమవంతు పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.