పంచాయతీ ఎన్నికల్లో తిరుమల ప్రసాదంతో వైకాపా నేతలు రాజకీయాలు చేయటం దిగజారుడు తనమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. చిత్తూరు జిల్లా తొండవాడ సర్పంచ్ అభ్యర్థి.. ఓటర్లకు తిరుమల ప్రసాదం పంచడంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రేషన్ పంపిణీకి ఉపయోగించే వాహనం ద్వారా.. శ్రీవారి లడ్డూలను పంచటం, ఓటర్ స్లిప్పులు అందించటం ప్రలోభాలకు గురిచేయడమేనన్నారు. తితిదే ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా వైకాపా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సామాన్య భక్తులను అనేక నిబంధనలతో ఇబ్బంది పెడుతూ, వైకాపా నేతలకు లక్షల సంఖ్యలో లడ్డూలు ఏ విధంగా పంపిణీ చేశారని నిలదీశారు.
రక్షణ యాత్ర కాదు.. భక్షణ యాత్ర: అయ్యన్న