వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. జగన్ సీఎం అయ్యాక యథేచ్చగా అన్నీ ఉల్లంఘనలే జరుగుతున్నాయని అన్నారు. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. అన్ని వర్గాల హక్కుల అణచివేతే జగన్ అజెండా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పరిణామాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలన్న యనమల... రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జగన్ తుగ్లక్ చర్యలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.